Header Banner

హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త రీఛార్జ్ ప్లాన్! పూర్తి వివరాలు మీకోసం!

  Sun Feb 23, 2025 12:55        Business

కొత్త రీఛార్జ్ ప్లాన్ తెచ్చిన జియో.. హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో..!  రిలయన్స్ జియో టెలికం సంస్థ.. నానాటికీ తన పరిధిని విస్తరించుకుంటోంది. ఇటీవల జియో-హాట్‌స్టార్ ఒక్కటవ్వడంతో.. ఇప్పుడు హాట్ స్టార్ యాప్‌కి సబ్‌స్క్రిప్షన్ చేసుకునే అవకాశాన్ని జియో కల్పిస్తోంది. ఇందుకోసం సరికొత్త రీచార్జ్ ప్లాన్ తెచ్చింది. తద్వారా విడిగా హాట్ స్టార్ కోసం సబ్‌స్క్రిప్షన్ మనీ చెల్లించాల్సిన అవసరం లేకుండా చేస్తోంది. 

 

ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 

 

ఈ ప్లాన్ విలువ రూ.949. ఇది 84 రోజుల వ్యాలిడిటీ కలిగివుంది. దీని ద్వారా మొత్తం 168జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. డేటా లిమిట్ పూర్తైన తర్వాత.. నెట్ స్పీడ్ 64kbpsకి తగ్గుతుంది. ఐతే.. 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్నవారు.. అన్‌లిమిటెడ్‌గా 5జీ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో జియో హాట్‌స్టార్ సబ్స్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అంటే.. 84 రోజులపాటూ.. హాట్‌స్టార్‌ని ఉచితంగా చూడవచ్చు. ఇంకా జియో టీవీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్లు కూడా పొదే వీలు ఉంది. ఈ ప్లాన్ ద్వారా ఇప్పటివరకూ హాట్‌స్టార్‌ని ఎక్స్‌పీరియన్స్ చెయ్యని వారికి.. దాన్ని అలవాటు చేసేలా జియో ఈ ప్లాన్ తెచ్చినట్లు కనిపిస్తోంది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇక ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇంకా రోజూ 100 SMSలు పంపుకోవచ్చు. ఈ ప్లాన్ కావాలి అనుకునేవారు.. జియో యాప్‌లో పాపులర్ ప్లాన్స్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ Top Trending True 5G Unlimited Plansలో ఈ ప్లాన్ ఉంది. ఈ సెగ్మెంట్‌లో మొత్తం 13 ప్లాన్స్ ఉన్నాయి. కొతమంది జియోహాట్ స్టార్ కావాలనుకుంటారు. ఐతే.. వారు క్రికెట్ కోసమే ఈ యాప్‌ని కోరుకునే ఛాన్స్ ఉంది. అలాంటి వారి కోసం జియోలో రూ.195 విలువగల క్రికెట్ డేటా ప్యాక్ ఉంది. ఇది 90 రోజుల వ్యాలిడిటీ కలిగివుంది. ఇందులో 15జీబీ డేటా లభిస్తుంది. అలాగే హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Business #Jio #India #JioOffers